Giorgia Meloni:భారత్ తలచుకుంటే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దాన్ని ఆపగలదు..ఇటలీ ప్రధాని మెలోని కీలక వ్యాఖ్యలు

by Maddikunta Saikiran |
Giorgia Meloni:భారత్ తలచుకుంటే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దాన్ని ఆపగలదు..ఇటలీ ప్రధాని మెలోని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్:రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య గత రెండు సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఇరు దేశాల మధ్య యుద్దాన్ని ఆపడానికి భారత్ సహా పలు అగ్ర దేశాలు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్‌ మధ్య సంధి చర్చలపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని(Giorgia Meloni) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్‌(India) కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ వివాదాన్ని పరిష్కారించడంలో భారత్(India), చైనా(China)) కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు. శనివారం ఉత్తర ఇటలీ(Italy)లోని సెర్నోబియో(Cernobio) నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో శనివారం మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా శనివారం మెలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌(Ambrosetti Forum)లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెలోనీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రూపొందిచిన నియమాలను కాపాడే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఘర్షణలో భారత్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు, ఆ దిశగాఈ రెండు దేశాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ మెలోని పేర్కొన్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పరిష్కరించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేసిన 48 గంటల తర్వాత మెలోని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed