- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో గన్ కల్చర్‌కు స్వస్తి పలికేందుకు వినూత్న ఆఫర్.. ‘గన్ సమర్పిస్తే.. గిఫ్ట్ కార్డు’
న్యూయార్క్ : అమెరికాలో గన్ కల్చర్‌కు స్వస్తి పలికేందుకు వినూత్న ఆఫర్.. ‘గన్ సమర్పిస్తే.. గిఫ్ట్ కార్డు’అమెరికా (America) దేశ చట్ట ప్రకారం పౌరులందరూ ఆత్మరక్షణ కోసం తుపాకులు కలిగి ఉంటారు. అక్కడ దాదాపు ప్రతి ఇంట్లో తుపాకులు ఉంటాయి. అయితే కొందరు వీటిని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఈ గన్ కల్చర్ (Gun culture) వల్ల ప్రతి సంవత్సరం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.ఈ దారుణాల్లో ఎంతో మంది అమాయకులు, పిల్లలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గన్ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా న్యూయార్క్ పౌరులు తమ వద్ద ఉన్న తుపాకులను సమర్పిస్తే విలువైన గిఫ్ట్ కార్డులు ఇస్తామని అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు నగర వ్యాప్తంగా 9 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తుపాకీ హింస నుంచి న్యూయార్క్ వాసులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని లెటిటియా జేమ్స్ తెలిపారు. తొలిరోజే ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వేల మంది పౌరులు ముందుకొచ్చి తమ వద్ద ఉన్న ఆయుధాలను అధికారులకు అప్పగించారు. ఆదివారం ఒక్కరోజే పౌరుల నుంచి 3,076 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో 185 భారీ ఆయుధాలు ఉన్నాయి.
మొదటి ఆయుధాన్ని అప్పగించిన వారికి 500 డాలర్ల వరకు గిఫ్ట్ కార్డు, ఆపై ప్రతి ఆయుధానికి 150 డాలర్ల మేర గిఫ్ట్ కార్డులు అందజేశారు. హ్యాండ్ గన్, అసాల్ట్ రైఫిల్, ఘోస్ట్ గన్, షాట్ గన్, 3డీ ప్రింటెడ్ గన్ ఇలా రకరకాల ఆయుధాలను పౌరులు సరెండర్ చేశారు. సిరాక్యూజ్ ప్రాంతం నుంచి అత్యధికంగా 751 ఆయుధాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 5 వేల డాలర్ల వరకు అందుకున్నాట్లు వెల్లడించాడు. బ్రూక్లిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తొలి మూడు గంటల్లోనే 90 తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.