Gaza citizens: గాజా పౌరులను ఆకలితో చంపడమే న్యాయం.. ఇజ్రాయెల్ మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్

by vinod kumar |
Gaza citizens: గాజా పౌరులను ఆకలితో చంపడమే న్యాయం.. ఇజ్రాయెల్ మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ రక్షించే వరకు రెండు మిలియన్లకు పైగా గాజా పౌరులను ఆకలితో చంపడమే న్యాయం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాకు మానవతా సహాయం అందిస్తే అది ఇజ్రాయెల్‌కు ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చు్కోవడం కూడా తమకు చాలా ప్రమాదమని తెలిపారు. బంధీలను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తమపై ఉందన్నారు.

అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల కొంతమంది బంధీలు మాత్రమే రిటర్న్ వచ్చే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. అంతేగాక యుద్ధ విజయాలను తుంగలో తొక్కినట్టు అవుతుందని, పాలస్తీనా సైన్యం త్వరగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. హమాస్ తో ఢీల్ కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తున్న వారు బాధ్యతా రహితంగా ఉన్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్‌ను బలహీన పర్చేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాల్పుల విరమణ ప్రతిపాదనలు సైతం న్యాయబద్దంగా లేవన్నారు. తమ దేశ భద్రతకే విఘాతం కలిగించేలా ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 39,600 మంది పాలస్తీనియన్లు మరణించగా..91,600 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అంతేగాక గాజాలోని పౌరులు ఆహారం లేక అల్లాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed