- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్..
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అల్ ఖదీర్ ట్రస్ట్ నిధుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఇమ్రాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ లాయర్లు ఇస్లామాబాద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
ఇక, అల్ ఖదీర్ ట్రస్ట్ నిధుల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో పాక్ ఆర్మీ ఈ నెల 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం ఆర్మీ అతడిని రహస్య ప్రాంతానికి తరలించింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంతో పాక్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆయన అభిమానులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రోడ్లపైకి వచ్చి భారీగా నిరసనలు చేశారు.