చట్టవిరుద్ధంగా పెళ్లి.. ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు ఏడేళ్ల జైలు

by Hajipasha |   ( Updated:2024-02-03 12:27:13.0  )
చట్టవిరుద్ధంగా పెళ్లి.. ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు ఏడేళ్ల జైలు
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా ఖాన్‌కు మరో కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడింది. 2018 సంవత్సరంలో వాళ్లిద్దరు వివాహ చట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నందుకు ఈ శిక్షను విధిస్తూ పాక్‌లోని ఓ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బుష్రా ఖాన్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పటికీ.. ఇస్లామిక్ చట్టాల ప్రకారం ‘ఇద్దత్’‌ను పాటించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇద్దత్ అంటే.. విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోకుండా వేచి ఉండాల్సిన కనీస నిరీక్షణ వ్యవధి. అంటే విడాకుల తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా వెంటనే ఇమ్రాన్‌ను బుష్రా పెళ్లి చేసుకోవడాన్ని చట్టవిరుద్ధమైన అంశంగా కోర్టు పరిగణించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కావడానికి సరిగ్గా 7 నెలల ముందు.. 2018 జనవరిలో బుష్రాను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వివిధ కేసుల్లో శిక్షలు పడటంతో ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే జైలుశిక్షలు అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని గార్రిసన్ సిటీ జైలులో ఉండగా, ఇస్లామాబాద్‌లోని హిల్‌టాప్ మాన్షన్‌ జైలులో ఆయన భార్య బుష్రా శిక్షను అనుభవించనున్నారు.

Advertisement

Next Story