శవాలను తిని అంతిమ యాత్ర..

by Vinod kumar |
శవాలను తిని అంతిమ యాత్ర..
X

లండన్: 15వేల ఏళ్ల క్రితం ఆది మానవులు ఆచరించిన ఒక విస్మయకర ఆచారం తాజా పరిశోధనల్లో వెలుగుచూసింది. అప్పట్లో వాయవ్య ఐరోపాలో జీవించిన ‘మాగ్డలీనియన్’ ఆదిమ జాతిలోని కొన్ని తెగల ప్రజలు చనిపోయినవారిని పాతిపెట్టే బదులు తినే వారని గుర్తించారు. మృతదేహంలోని మాంసాన్ని తిని, మిగిలిన అవశేషాలతో అంతిమయాత్ర నిర్వహించే వారని కనుగొన్నారు. బ్రిటన్ రాజధాని లండన్ లో ఉన్న నేషనల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకులు జరిపిన రీసెర్చ్ లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆ తెగకు చెందిన ఆదిమానవులు ఆకలి తీర్చుకునేందుకు కాకుండా.. కేవలం ఆచారాన్ని పాటించే క్రమంలోనే చనిపోయిన వారి మాంసాన్ని తినేవారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈవిధమైన ఆచారాన్ని పాటించారని భావిస్తున్న 59 మాగ్డలీనియన్ సైట్లను గుర్తించడానికి ఎన్నో చరిత్ర, పురావస్తు పుస్తకాలను సైంటిస్టులు జల్లెడ పట్టారు.

చివరకు ఈ సైట్లు బ్రిటన్ తో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్, రష్యా, బెల్జియం, పోలాండ్, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్‌లలో ఉన్నాయని తేల్చారు. 25 మాగ్డలీనియన్ సైట్‌లలో జరిపిన రీసెర్చ్ ఆధారంగా ఆనాటి ఆదిమ తెగల అంత్యక్రియల ఆచారాలు, శవాలను తిన్నాక మిగిలిన అవశేషాలతో అంతిమ యాత్రలను నిర్వహించే సంప్రదాయం వివరాలను శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. పుర్రె ఎముకలను కత్తిరించిన గుర్తులు, ఎముక మజ్జను దంతాలతో నమిలిన గుర్తులు 15 మాగ్డలీనియన్ సైట్‌లలో లభ్యమయ్యాయి. ఈమేరకు వివరాలతో కూడిన రీసెర్చ్ రిపోర్ట్ ‘క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్‌’ జర్నల్ లో పబ్లిష్ అయింది.

Advertisement

Next Story