Elon Musk Vs Mark Zuckerberg : మార్క్ జుకర్‌బర్గ్‌ పై ఎలాన్ మస్క్ సంచలన వాఖ్యలు

by Maddikunta Saikiran |
Elon Musk Vs Mark Zuckerberg : మార్క్ జుకర్‌బర్గ్‌ పై ఎలాన్ మస్క్ సంచలన వాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌ల మధ్య కొంతకాలంగా సీరియస్ పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ దాని పేరును ఎక్స్(X) గా మార్చి కొత్త లుక్ ఇస్తుంటే.. దానికి పోటీగా ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ మెటా థ్రెడ్స్ (Threads) యాప్ పేరుతో మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తెచ్చాడు. దీంతో ఇరువురి మధ్య పోటీ మరింత ముదిరింది. ఇందులో భాగంగా వరుసగా ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. కాగా కొన్ని నెలల క్రితం వీరిద్దరూ కుస్తీ పడటం కోసం కూడా రెడీ అయ్యారు కానీ అనుకోని కారణాల వల్ల వారి కుస్తీ రద్దయింది.

ఇదిలా ఉంటె మస్క్ తాజాగా జుకర్‌బర్గ్‌ పై చేసిన వాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రముఖ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ ను అరెస్ట్ చేసినట్టుగానే జుకర్‌బర్గ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయాలనీ అన్నారు.టెలిగ్రామ్ మాదిరే ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటెంట్ నియంత్రణలో ఉండటం లేదని ఇన్స్టాగ్రామ్ లో పిల్లలు అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఈ కారణంగానే జుకర్‌బర్గ్‌ను అరెస్టు చేయాలని వెల్లడించారు.దీంతో వీరిద్దరి మధ్య మరోసారి అగ్గిరాజేసుకుంది. దీనిపై జుకర్‌బర్గ్‌ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. కాగా టెలిగ్రామ్ లో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, అలాగే కంటెంట్ నియంత్రణ లేకపోవడం వంటి తదితర ఆరోపణలపై ఆ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను నిన్న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేల ఈ కేసులో నేరం రుజువైతే పావెల్ దురోవ్‌కు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Next Story