టర్కీ, సిరియాలో మళ్లీ భూకంపం..

by Mahesh |
టర్కీ, సిరియాలో మళ్లీ భూకంపం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సుమారు. 47 వేల మంది మృతిచెందారు. అలగే లక్షల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఎంతో మంది తమ నివాసాలు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ఇంతటి భారీ విధ్వంసం నుంచి కోలుకుంటున్న సందర్భంలో మరో భూకంపం పిడుగులా వచ్చి పడింది. ఫిబ్రవరి 21న 6.3 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. దీనివల్ల సుమారు ముగ్గురు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. కాగా ఇలాంటి భూకంపాలు ఇక ముందు కూడా సిరియాలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. కాగా ఈ రోజు సంభవించిన భూకంపం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed