- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దు..ఇరాన్‌కు బైడెన్ వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి పాల్పడబోతుందన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. అటాక్ చేసే ఆలోచనలు మానుకోవాలని సూచించారు. ‘ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా అండగా ఉంటుంది. ఆ దేశానికి మద్దతిస్తాం. ఇజ్రాయెల్‌ను కాపాడటానికి కృషి చేస్తాం. దాడికి పాల్పడితే ఇరాన్ విజయం సాధించలేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇజ్రాయెల్‌పై ఇరాన్ తప్పకుండా దాడి చేస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా, ఈ నెల 1న ఇజ్రాయెల్ డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేయగా..ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ చెబుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని సైనిక లక్ష్యాలపై దాడి చేసేందుకు ఇరాన్ 100కి పైగా క్షిపణులు, డ్రోన్‌లను సిద్ధం చేసిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమై ఇజ్రాయెల్, ఇరాన్ లలోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేశాయి.