రాహుల్‌పై అనర్హత వేటు: యూఎస్ చట్ట సభ్యుడు ఏమన్నారంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-25 09:13:28.0  )
రాహుల్‌పై అనర్హత వేటు: యూఎస్ చట్ట సభ్యుడు ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంపై భారత అమెరికన్ కాంగ్రెస్ చట్ట సభ్యుడు రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారతదేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుందన్నారు. మా తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదన్నారు.

భారత ప్రజస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది కదా అని ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ ను ట్యాగ్ చేశారు. రాహుల్ అనర్హత గురించి న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రో ఖన్నా తాత అమర్ నాథ్ విద్యాలంకార్ ఇండిపెండెన్స్ పోరాటంలో పాలుపంచుకున్నారు. లాలా లజపతి రాయ్ తో కలిసి ఆయన పనిచేశారు.

Advertisement

Next Story