- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటర్ స్లైడ్‌పై జరిగిన ఆ హఠాత్పరిణామంతో 4 అంగుళాలు తగ్గింది..?!
దిశ, వెబ్‌డెస్క్ః రెప్పపాటులో మనిషి జీవితం తల్లకిందులు కావచ్చు. ఈ యువతి జీవితం కూడా అలాగే అయ్యింది. సెలవురోజును ఎంజాయ్ చేయడానికి ఆక్వాలాండ్ వాటర్ పార్క్‌కు వెళ్లిన జెన్నిఫర్ ప్రోక్టర్ జీవితం ఇలాగే తల్లకిందులయ్యింది. మజోర్కాలోని ఒక హాలిడే రిసార్ట్‌లో వాటర్ స్లైడ్ ఎక్కడంతో ప్రమాదవశాత్తూ తన వెన్నెముకకు గాయమయ్యింది. దానితో ఆమె తాను ఉన్న ఎత్తు కంటే 4 అంగుళాలు తగ్గింది. ఇప్పుడు ఆ రిసార్ట్ నుండి 500,000 పౌండ్ల పరిహారం డిమాండ్ చేస్తోంది. లండన్‌కు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ టీచర్ ట్రైనింగ్ చేస్తోంది. ఓ రోజు సెలవు దొరకడంతో ఏంజాయ్ చేద్దామని తన బాయ్‌ఫ్రెండ్‌తో హాలిడే రిసార్ట్‌కు వెళ్లింది. అక్కడ, 40 అడుగుల ఎత్తైన 'బంజాల్' స్లైడ్‌పై ధైర్యంగా జారాలనుకుంది. అయితే, కిందకు జారే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ప్రాథమికంగా ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత స్పెయిన్‌లో ఎమర్జెన్సీ స్పైనల్ ఫ్యూజన్ చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అది పూర్తయిన తర్వాత, ఆపరేషన్ ముందు 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న ఆమె ఆపరేషన్ తర్వాత 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు తగ్గింది. క్షణాల్లో ఆమె జీవితం తల్లకిందులవడంతో తీవ్రమైన వేదనకు లోనయ్యింది. అయితే, కుంగిపోలేదు, బాడీబోర్డుపై స్లైడ్‌పైకి వెళ్లే ముందు జెన్నిఫర్‌కు సరైన సూచనలు అందించలేదని ఆరోపణలతో కోర్టులో కేసు వేసింది. ఈ ప్రమాదం వల్ల తన టీచర్ ట్రైనింగ్ కొనసాగించలేకపోవడమే కాదు, మొత్తం జీవితమే నష్టపోయిందని కోర్టులో వాదిస్తోంది.