- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఉలిక్కిపడిన అమెరికా.. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దుండగుల కాల్పులు
దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక పై ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయనపై ఆరు రౌండ్ల పాటు కాల్పుల మోత మోగింది. అయితే, రెప్పపాటున దూసుకొచ్చిన ఓ బుల్లెట్ ఆయన కుడి చెవి నుంచి దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన ట్రంప్ వ్యక్తిగత సహాయకులు ఆయనను వెంటనే సమీపంలోని బట్లర్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు.
అయితే, కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది ఫైర్ ఓపెన్ చేసి హతమార్చారు. ప్రస్తుతం ట్రంప్ కొలుకుంటున్నారని వ్యక్తిగత అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి బైడెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ట్రంప్‌పై కాల్పుల ఘటనను పలు దేశాల అధినేతలు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. కాగా, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులతో అమెరికాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా పెన్సిల్వేనియా బట్లర్‌లో ట్రంప్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్ సర్వీసలు చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని బిల్డింగ్‌లను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
తనపై హత్యాయత్నం తరువాత డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రిలో మాట్లాడుతూ.. తన కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని తెలిపారు. ఊహించని ఘటన ఏదో జరిగిందని వెంటనే తనకు అర్థం అయిందని అన్నారు. తన వైపు ఏదో దూసుకెళ్లినట్లుగా శబ్ధం వచ్చిందని తెలిపారు. అప్పుడే చర్మంలోకి ఏదో చొచ్చుకెళ్లినట్లుగా తెలిసిందని అన్నారు. కాగా, తుపాకీ పట్టుకున్న దుండగుడి గురించి అక్కడున్న పోలీసులను హెచ్చరించే ప్రయత్నం చేశానంటూ అక్కడే ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు కూడా అర్థం కాలేదని అతడు తెలిపాడు.
కాగా, ట్రంప్‌పై కాల్పులు జరిపిన ఓ దుండగుడిని ప్రాథమిక దర్యాప్తులో భాగంగా FBI గుర్తించింది. 182 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్లుగా భద్రతా సిబ్బంది గుర్తించారు. సభా వేదిక ఎదురుగా ఉన్న భవనం నుంచే దుండగులు ఫైరింగ్ చేసినట్లుగా ఎంక్వైరీలో వెల్లడైంది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్‌కు చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే షూటర్ కాల్పులు జరిపినట్లుగా తేలింది. ట్రంప్‌ను హత్య చేసేందుకు AR 15 సెమీ ఆటోమెటిక్ గన్‌ను దుండగుడు వాడినట్లుగా ఎఫ్‌బీఐ తెలిపింది.