UK: స్కాట్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

by GSrikanth |
UK: స్కాట్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. యూకేలోని స్కాట్లాండ్, అబర్దీన్ సిటీలోని హిందూ దేవాలయాల ట్రస్ట్ అధ్వర్యంలో సోమవారం తెలుగు కమ్యూనిటీ ప్రజలు ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను చేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా మహిళలు ఆట, పాటలతో పాటు దాండియా ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం బతుకమ్మలను స్థానిక డాన్ రివర్‌లో నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ పల్లెలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పూల పండుగ నిర్వహించడం వల్ల ఈ తరం పిల్లలకు బతుకమ్మ విశిష్టత తెలుస్తుందని నిర్వహకులు వివేక్ పడకంటి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా నివసిస్తున్న ప్రవాస భారతీయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







Advertisement

Next Story

Most Viewed