Muhammad Yunus : బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేతగా యూనుస్ ప్రమాణం

by Hajipasha |   ( Updated:2024-08-08 17:01:26.0  )
Muhammad Yunus : బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేతగా యూనుస్ ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్‌గా నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనుస్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి రాజధాని ఢాకాలోని దేశాధ్యక్ష భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 84 ఏళ్ల యూనుస్‌తో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. యూనుస్ చేపట్టిన ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ పదవి అనేది ప్రధానమంత్రి పదవికి సరి సమానమైనదని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలు దేశాల దౌత్యవేత్తలు, ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, పౌర సమాజానికి చెందిన సభ్యులు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిపోయిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా యూనుస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకపోవడం గమనార్హం.

Advertisement

Next Story