- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pakistan Train Hijack: మీకు రాజధాని లేకుండా చేస్తాం.. మా జోలికి వస్తే చస్తారు.. పాక్ ఆర్మీకి ఇచ్చిపడేసిన బలూచ్ కమాండర్

దిశ, వెబ్ డెస్క్ : Pakistan Train Hijack: పాకిస్తాన్ లో రైలు హైజాక్ ఘటన తర్వాత పాకిస్తాన్(Pakistan) ప్రతీకారం తీర్చుకుంటుందని బెలూచిస్తాన్(Baloch) తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుంటుందని నమ్ముతారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్(Shahbaz Sharif) కూడా గురువారం దీని గురించి సూచనప్రాయంగా చెప్పారు. అయితే ఇంతలో బెలూచిస్తాన్ కమాండర్(Balochistan Commander) పాకిస్తాన్ సైన్యానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ సైన్యం మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే మన తదుపరి లక్ష్యం లాహోర్(Lahore), రావల్పిండి(Rawalpindi) లేదా ఇస్లామాబాద్(Islamabad) కవ్వించే విధంగా మాట్లాడారు.
పాకిస్తాన్ సైన్యం(Pakistan Army) మా పిల్లలను చంపారని బెలూచిస్తాన్ కమాండర్ అల్ జజీరాతో తెలిపారు. మన మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అలాంటి చర్య పునరావ్రుతమైతే మేము తగిన సమాధానం ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఏ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారని బెలూచిస్తాన్ కమాండర్ అడిగినప్పుడు..మన చేతుల్లో ఏమీ లేదన్నారు. ఈ విషయాన్ని ఏ దిశలో తీసుకెళ్లాలనేది పంజాబీ సైన్యంలో చేతుల్లోనే ఉందని తెలిపారు.
కాగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్(Commander of the Balochistan Liberation Army) మాట్లాడారు. పాకిస్తాన్ బలూచ్ లను మరింత అణచివేయడానికి ప్రయత్నిస్తే మేము కూడా అంతే వేగంగా తిరగబడతామని హెచ్చరించారు. వాళ్లు మన యోధులను చంపితే మనం వాళ్ల సైన్యాన్ని చంపుతామన్నారు. వాళ్లు అమాయక బలూచ్ లను చంపుతామన్నారు. వాళ్లు అమాయక బలూచ్ లను చంపుతున్నారు కాబట్టి ఎక్కడో మనం వాళ్లని కూడా చంపాల్సి వస్తుంది.
వాళ్లు ఏం చేసినా జవాబు చెప్పాల్సిందే అనే గుణపాఠం మనం వాళ్లకు నేర్పించాలనుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ గతంలో కూడా మిమ్మల్ని అణచివేశారు. ఇది మళ్లీ జరిగితే ఈ సారి మా రియాక్షన్ మరోలా ఉంటుందని హెచ్చరించరు. మా లక్ష్యం ఇస్లామాబాద్, లాహోర్ లేదా రావల్పిండి కావచ్చు. ఎలాంటి సందేహం లేదు. మాకూ అర్ధం అయ్యింది. వాళ్లు కోలుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాము అని తెలిపారు.