Hamas Hostages : ఇజ్రాయెలీ బందీల మృతదేహాల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

by Hajipasha |
Hamas Hostages : ఇజ్రాయెలీ బందీల మృతదేహాల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : గాజాలోని రఫా ప్రాంతంలో ఉన్న ఓ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల డెడ్‌బాడీలు లభించిన ఘటన కలకలం రేపింది. ఆ మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.

ఇజ్రాయెలీ సైనిక దళాలు ఆ సొరంగం వద్దకు చేరుకోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు.. హమాస్ ఉగ్రవాదులు ఆ ఆరుగురు బందీలపైకి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయినట్లు వెల్లడైంది. అనంతరం ఉగ్రవాదులు ఆ సొరంగాన్ని వదిలేసి వెళ్లిపోయారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Advertisement

Next Story