ఓటీటీలోకి అదా శర్మ ‘CD’..

by sudharani |
ఓటీటీలోకి అదా శర్మ ‘CD’..
X

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ వంటి బ్లాక్ బస్టర్ (blockbuster) హిట్స్ తర్వాత ప్రజెంట్ అదా శర్మ పేరు ఇండస్ట్రీమలో మారుమోగుతోంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘CD’ (క్రిమినల్ ఆర్ డెవిల్). సైకాలజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణ అన్నం (krishna annam) దర్శకత్వం వహించగా.. గిరిధర్ (Giridhar) నిర్మించాడు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘CD’ బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ (Digital Streaming) కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ‘CD’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ (OTT) ఆహా సొంతం చేసుకోగా.. అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed