- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆమె సాహసం భారతావనికి గర్వకారణం.. సునీతా విలియమ్స్ రాకపై మంత్రి కొండా సురేఖ

దిశ, వెబ్ డెస్క్: ఆమె సాహసం భారతావనికి గర్వకారణం అని భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Austronat Sunitha Viliams) ను ఉద్దేశించి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అన్నారు. అంతరిక్షానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ (Buch Vilmor) దాదాపు తొమ్మిది నెలల తర్వాత స్పెస్ ఎక్స్ (Space X) కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా భూమి మీదకి తిరిగి వచ్చారు. దీంతో ఆమె రాకపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె.. దివి నుంచి భువికి సునీతా విలియమ్స్ అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9 నెలలు అంతరిక్షంలో గడిపి, భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ అని, ఆమె సాహసం భారతావనికి గర్వకారణమని కొనియాడారు. అలాగే తొమ్మిది నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత సునీతా విలియమ్స్ క్రూ-9 సభ్యులతో కలిసి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారని తెలియజేశారు. సుమారు 17 గంటల ప్రయాణం అనంతరం, ఫ్లోరిడా సముద్ర తీరంలో పారాచూట్ల సాయంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని అన్నారు. అంతేగాక అంతరిక్ష విజ్ఞానానికి ఆమె చేసిన సాహసం, కృషికి గౌరవాన్ని తెలియజేస్తూ, భూమి నుండి అనంత విశ్వం వరకు వారు చేసిన ఈ మహత్తర ప్రయాణాన్ని చూసి భారత్ గర్విస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
Read More..
Cabinet Meeting: ముగిసిన కేబినెట్ భేటీ.. వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర
Sunita Williams: వావ్.. సునీతకు డాల్ఫిన్లు ఎలా వెల్కమ్ చెప్పాయో చూడండి!