Burkina Faso : బుర్కినా ఫాసోలో దారుణం.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి, 140 మందికి పైగా గాయాలు..!

by Maddikunta Saikiran |
Burkina Faso : బుర్కినా ఫాసోలో దారుణం.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి, 140 మందికి పైగా గాయాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మళ్లీ హింస చెలరేగింది. కయాకు ఉత్తరాన 40కిమీ దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం చోటు చేసుకున్న దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) అనే ఒక సాయుధ సమూహం ఊచకోతకు పాల్పడ్డారు. జిహాదీలు జరిపిన తుపాకీ కాల్పుల్లో కనీసం 200 మంది చనిపోయారని,140 మంది గాయపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన రీజినల్‌ స్పెషలిస్ట్‌ ఒకరు తెలిపారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారని తెలుస్తోంది. బర్సాలోగో వద్ద శనివారం భద్రతా బలగాలు, గ్రామస్థులు కలిసి భద్రతా అవుట్‌పోస్టులను రక్షించడానికి కందకాలు(Trenches) తవ్వుతుండగా వారిపై JNIM ఫైటర్లు కాల్పులు జరిపారు. ఈ దాడి తరువాత అనేక మంది సైనికులు, ప్రజలు తప్పిపోయారు. కాగా ఈ దాడి తామే చేశామని అల్‌ఖైదా ప్రకటించకుంది.

కాగా ఈ ఘటనకు సంబంధించి భయంకరమైన వీడియోలను JNIM సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తమ ప్రాణాలను పురుషులు, స్త్రీలు , పిల్లలు తాము త్రవ్విన కందకాలలో పడుకోవడం చూడవచ్చు. ఈ దాడి జరగబోతోందని బుర్కినా ఫాసో సైన్యానికి శుక్రవారం తెలిసిందని, కందకాలు తవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారని నికోలస్ హక్ అనే స్థానిక రిపోర్టర్ పేర్కొన్నారు. ఈ దాడిలో గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఆసుపత్రి వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బందిని కయా పట్టణం నుండి పిలిపించారు.బుర్కినా ఫాసో దేశంలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేదు. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అక్కడి ప్రజలలో వేలాది మందిని పొట్టనబెట్టుకున్నారు . ‘జిహాదీ గ్రూపుల దాడిలో సైనికులు, సామాన్య పౌరులు చనిపోయారని ఆ దేశ రక్షణ మంత్రి చెప్పారు.

Next Story