- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడి: ఐదుగురు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. దక్షిణ లెబనాన్ లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఐదుగురు మృతి చెందగా..తొమ్మిది మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్టు లెబనాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఖిర్మెట్ సెల్మ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. మృతుల్లో ఓ గర్భంతో ఉన్న మహిళ సైతం ఉన్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఇళ్లంతా ద్వంసం కాగా..సమీపంలో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల కూడా దక్షిణ లెబనాన్ సరిహద్దు గ్రామమైన హులాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇద్దరు దంపతులు సహా వారి కుమారుడు మరణించారు.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్భొల్లా ఉగ్రవాదులపై నిరంతరం దాడులు చేస్తున్నది. సరిహద్దుల్లో కాల్పులకు తెగపడుతోంది. ప్రధానంగా లెబనాన్ దక్షిణ సరిహద్దులోనే దాడి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అక్కడి పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 30,960 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే హిబ్బోల్లా మిలిటెంట్లు 312 మంది, లెబనాన్ పౌరులు 56 మంది మృతి చెందారు. మరోవైపు గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హిజ్భొల్లా మిలిటెంట్లు చేసిన దాడుల్లో 10 మంది ఇజ్రాయెల్ సైనికులు, ఏడుగురు సాధారణ పౌరులు మరణించారు.