- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎవరెస్ట్‌పై అమెరికా పర్వత అధిరోహకుడి మరణం
ఎవరెస్ట్‌పై అమెరికా పర్వత అధిరోహకుడి మరణంప్రపంచంలోనే అ్యతంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest)ని అధిరోహించడానికి ప్రయత్నిస్తూ సోమవారం అమెరికాకు చెందిన ఒక పర్వత అధిరోహకుడు మృతి చెందారు. 2023 సంవత్సరంలో ఎవరెస్ట్ పర్వతంపై చనిపోయిన వారి సంఖ్య దీనితో నాలుగుకు చేరింది. గత నెలలో ముగ్గురు నేపాల్ పౌరులు చనిపోయారు. ఆ అమెరికన్ అధిరోహకుడి వయస్సు 69 సంవత్సరాలు. అతను ఎవరెస్ట్‌పై 6,400 మీటర్ల ఎత్తులో ఉన్న రెండవ క్యాంప్ వద్ద మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
'బెయుల్ అడ్వెంచర్' అనే పర్వత యాత్రలు నిర్వహించే ఒక అమెరికన్ సంస్థ తరపున ఆ అధిరోహకుడు మౌంట్ ఎవరెస్ట్ చేరుకున్నాట్లు సమాచారం. బెయుల్ అడ్వెంచర్ అధికారి అయిన పసాంగ్ షెర్పా మాట్లాడుతూ.. ఆ అధిరోహకుడు రెండవ క్యాంప్ వద్దకు చేరుకోగానే అతని ఆరోగ్యం క్షీణించినట్లు గుర్తించాము.. ఆయన స్పృహ కోల్పోగానే వైద్య చికిత్సలు ప్రారంభించాము. కానీ ఆయన శ్వాస ఆగిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రదేశంలోని వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి" అని చెప్పారు.
ఎవరెస్ట్ పర్వతంపై అధిరోహించడానికి ఏప్రిల్, మే నెలలో వాతావరణం అనువుగా ఉంటుంది. జూన్ నెల మెుదటి వారం నుంచి వాతావరణం ప్రమాదకరంగా మారుతుంది. ప్రతి సంవత్సరం సగటున అయిదుగరు అధిరోహకులు ఎవరెస్ట్ పర్వతంపై మరణిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2019 సంవత్సరంలో అత్యధికంగా 11 మంది చనిపోయారు.