America-Israel: నెతన్యాహు తీరు వల్లే ఆరుగురు బందీల మృతి..ఇజ్రాయెల్ ప్రధానిపై విరుచుకుపడ్డ జో బైడెన్

by Maddikunta Saikiran |
America-Israel: నెతన్యాహు తీరు వల్లే ఆరుగురు బందీల మృతి..ఇజ్రాయెల్ ప్రధానిపై విరుచుకుపడ్డ జో బైడెన్
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆదివారం హమాస్ ఆధీనంలో ఉన్న ఆరుగురు బందీలు హతమయ్యారన్న విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరి మృత దేహాలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆదివారం గాజా ప్రాంతంలోని రఫా నగరంలో ఓ సొరంగంలో కనుగొన్నారు.వీరి మృతి పట్ల ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ప్రజలందరూ రోడ్ల పైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆసుపత్రి, బ్యాంక్, ఎయిర్ పోర్టుల్లో సిబంది సమ్మె చేస్తున్నారు.ప్రధాని నెతన్యాహు వెంటనే హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.బందీలు మరణించడానికి ప్రధాని నెతన్యాహు కారణమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీరుపై విరుచుకుపడ్డారు, అతను హమాస్ తో వెంటనే సంధి కూర్చుకోవడానికి ఒప్పుకోవాలని, నెతన్యాహు తీరు వల్లే ఇలా జరిగిందని బైడెన్ అసహం వ్యక్తం చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో సమావేశం నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.హారిస్‌తో సమావేశానికి ముందు వైట్ హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడారు.ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో నెతన్యాహు తగినంత కృషి చేస్తున్నారా అనే ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. బైడెన్ లేదు అని బదులిచ్చారు. అయితే ఆదివారం హమాస్ చేత చంపబడిన ఆరుగురు బందీలలో కాలిఫోర్నియా వాసి 'హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్' కూడా ఉన్నాడు.దీంతో అతని మరణం పట్ల బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అతని మరణవార్త తనకెంతో బాధ కలిగించిందని చెప్పారు.హమాస్ ఈ నేరాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, బందీలను చంపిన వారిని ఎక్కడున్నా వేటాడి మరి చంపేస్తామని బైడెన్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed