విమాన ప్రయాణంలో మహిళలకు చేదు అనుభవం.. అందరి ముందు ప్యాంటు విప్పమన్న సిబ్బంది

by S Gopi |   ( Updated:2023-05-08 04:46:12.0  )
విమాన ప్రయాణంలో మహిళలకు చేదు అనుభవం.. అందరి ముందు ప్యాంటు విప్పమన్న సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : విమాన ప్రయాణం చేయడానికి వెళ్లిన ఇద్దరు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. వారిలో ఒకరు తనను అందరి ముందు ప్యాంట్ ఇప్పాలంటూ ఎయిర్ లైన్స్ సిబ్బంది తనపై బలవంతం చేశారంటూ ఆరోపించడం గమనార్హం. వారి కారణంగా తాను ఎయిర్ పోర్టులో అందరి ముందు ప్యాంట్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే హాస్యనటి క్రిస్సీ మేయర్ తన స్నేహితురాలు కీను థాంప్సన్‌తో కలిసి అమెరికన్ ఎయిర్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే వారిద్దరూ ఫ్లైట్ ఎక్కే ముందు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వారి బాటమ్ వేర్ అమోదయోగ్యంగా లేదని.. వెంటనే మార్చుకోవాల్సిందిగా చెప్పడం విశేషం.

దానికి క్రిస్సీ మేయర్, ఆమె స్నేహితురాలు ఒప్పుకోక పోగా.. వారిని ప్రయాణం కోసం అనుమతించేదిలేదని చెప్పారు. దీంతో చేసేదిలేక ఆ ఇద్దరు మహిళలు అందరి ముందు తమ బాటమ్ వేర్ తీసేసి.. ప్యాంట్లు వేసుకున్నారు.

ఈ విషయాన్ని క్రిస్సీ మేయర్ ట్విట్టర్ లో షేర్ చేసి అమెరికన్ ఎయిర్ ఎయిర్ లైన్స్ ని ట్యాగ్ చేశారు. తాను ప్యాంట్ మార్చుకోవడానికి ముందు ధరించిన ప్యాంట్ తో ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Indians in Gulf | గల్ఫ దేశంలో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఇద్దరు భారతీయులు.. అదెలాగంటే..

Advertisement

Next Story