- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుఫాన్ వేళ భూకంపం.. న్యూజిలాండ్‌లో ప్రకృతి బీభత్సం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఓ వైపు తుఫాన్ గాబ్రియెల్ ధాటికి భారీ వర్షాలు, వరదలతో అల్లకల్లోలం అవుతుంటే, అదే సమయంలో బలమైన భూకంపం ప్రకంపనలు రేపింది. బుధవారం రాజధాని వెల్లింగ్టన్‌లో భూమి బలంగా కంపించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ద్వీపంలోని పరపరౌము నుంచి 50 కిలోమీటర్ల దూరంలో 6.0 మ్యాగ్నిట్యూడ్ తో భారీ ప్రకంపనలు వచ్చాయని న్యూజిలాండ్ సివిల్స్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. త్సునామీ హెచ్చరికలు కూడా లేవని చెప్పింది. అయితే స్థానికులు 10-20 సెకండ్ల పాటు భూమి ఊగినట్లు అనిపించిందని చెప్పారు.
తుఫాన్ బీభత్సం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో భూకంపం వచ్చినట్లు తెలిపారు. తుఫాన్ దేశంలో తీవ్రమైన నష్టాన్ని కలిగించగా, పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. న్యూజిలాండ్ ప్రధాన దీవుల మధ్య 5.7 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటికే దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సంగతి తెలిసిందే.