పెళ్లి ఫొటోలు, బట్టలు తగులబెట్టి.. డివోర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న మహిళ

by Anjali |
పెళ్లి ఫొటోలు, బట్టలు తగులబెట్టి.. డివోర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగాలపై అందరిలోనూ అవగాహన పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇద్దరికి సమాన అవకాశాలు లభిస్తు్న్నాయి. దీంతో ఏ చిన్న విషయమైనా ఎవరూ తగ్గడం లేదు. చివరకు పెళ్లాక కూడా చిన్న చిన్న గొడవలతోనే విడాకుల వరకూ వెళ్తున్నారు.

అవి ప్రేమ పెళ్లిళ్లు అయినా, తల్లిదండ్రుల ఇష్టంతో చేసుకున్న పెళ్లిళ్లు అయినా. ఇలాంటి సంఘటనే అమెరికాకు చెందిన లారెన్ మిర్రర్(31) అనే ఓ మహిళ జీవితంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ‘వివాహమైన 10 సంవత్సరాల నుంచి నేను ప్రతిరోజు ఉదయం లేచాక ఎంతగానో ఏడ్చేదాన్ని, నా లైఫ్ ఇక మెరుగుపడదని నాలో నేనే బాధపడేదాన్ని, ఓ రోజు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 2021లో నా భర్త నుంచి విడిపోయాను. ఈ సంవత్సరం జనవరిలో కోర్టు విడాకులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీవితాంతం పిల్లల కోసం ఇద్దరం కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాని చెప్పారు.

దీంతో ఆమె డీవోర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంది. లారెన్ ఇందుకు ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేసింది. తన వైవాహిత జీవితంలోనున్న మెమోరీస్‌ ఏమీ తన వద్ద ఉండకూడదని ఎరుపు రంగు దుస్తులు ధరించిన.. పెళ్లి ఫొటోలను చింపేసింది. కిందపడేసి కాలుతో తొక్కేసింది. పెళ్లి బట్టల్ని కూడా నిప్పుతో కాల్చివేసింది. వీటన్నింటినీ ఫోటోగ్రాఫర్ అయిన లారెన్ తల్లి లారెన్ ఫెలిసియా బౌమన్ ఫోటోలు తీసింది.

ఈ ఫోటోషూట్‌లో తన ఫ్రెండ్ కూడా భాగమైందని తెలిపారు. ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యూబిటీ అనే పేజీ షేర్ చేసింది. లారెన్ ఎరుపు రంగు దుస్తులు ధరించి తన పెళ్లి ఫొటోలను చింపేయడాన్ని చూడవచ్చు. ఆమె తన పెళ్లి బట్టల్ని కూ‌లో డా కాల్చడం కనిపించింది. ఈ ఫొటో షూట్ ను ఫోటోగ్రాఫర్ అయిన ఆమె తల్లి లారెన్ ఫెలిసియా బౌమన్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె తన ప్రాణ స్నేహితురాలు కూడా పాల్గొంది

Advertisement

Next Story