పంచ‌దార కోసం పిచ్చ కొట్లాట‌..?! ఎందుకో మీరే చూడండి

by Sumithra |
పంచ‌దార కోసం పిచ్చ కొట్లాట‌..?! ఎందుకో మీరే చూడండి
X

దిశ‌, వెబ్‌డెస్క్ః వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చెప్పిన భ‌విష్య‌త్ ద‌ర్శ‌నంలో పంచ‌దార కోసం కొట్లాడే అంశం లేద‌ని అనుకోవ‌ద్దు! సూచ‌క క్రియ‌ల్లో 'కాస్త మార్పు అనుమతించద‌గిందే'న‌ని వ్యాక‌ర‌ణ గ్రంధాల్లో ఆర్యులు ఎప్పుడో చెప్పారు. ఇక‌, అస‌లు సంగతి ఏటంటే, క‌ర‌వు కాష్టానికి దారితీస్తుంద‌న్న‌ట్లే, యుద్ధం కరువుకూ దారి తీయ‌క‌మాన‌దు. తాజాగా ఇండియాలో మంచి నూనె ధ‌ర పెరిగినా, ప్ర‌స్తుతం శ్రీలంక‌లో క‌నిపిస్తున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చినా దానికి ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న యుద్ధ‌మే కార‌ణం మ‌రి..! గుక్కెడు నీటి కోసం కొట్టుకున్న చ‌రిత్ర తెలుసు కానీ గుప్పెడు పంచ‌దార కోసం ర‌ష్య‌న్లు పోరాటాలే చేస్తున్నారిప్పుడు. ఏంటీ వింత అనుకుంటున్నారా..?!

ఎవ‌రు తీసుకున్న గోతిలో వారు ప‌డ‌తార‌న్న‌ట్లు పంచ‌దార కోసం ర‌ష్యా సూపర్‌మార్కెట్ల‌లో ఒకరిపై ఒక‌రు ప‌డి దాదాపుగా కొట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్ర‌పంచంలో ఎన్నో మార్పుల‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ర‌ష్యాలోనూ ఆర్థిక పతనం మొద‌ల‌య్యింది. 2015 నుండి రష్యాలో వార్షిక ద్రవ్యోల్బణం ఈ యుద్ధంతో అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. ఇందులో భాగంగా ఎన్నో మార్పులు.. ఈ దేశంలో కొన్ని సూప‌ర్ మార్కెట్లు ఒక వినియోగదారుడికి 10 కిలోల పంచ‌దార‌ పరిమితిని విధించాయి. మ‌రోవైపు, రష్యా ప్రభుత్వ అధికారులు చక్కెర కొరత లేదని, వినియోగదారుల భయాందోళనల వ‌ల్లే సూప‌ర్ మార్కెట్లో ఇలాంటి సంక్షోభం పుట్టిందని గ‌గ్గోలు పెడుతున్నారు. ఇంకొక వైపు, చక్కెర తయారీదారులు ధరను పెంచాల‌నే సంక‌ల్పంతో పంచ‌దార‌ నిల్వల‌ను బ్లాక్ చేయ‌డం ఈ ప‌రిస్థితికి దారితీసింది. దీనితో, ర‌ష్యా నుండి చక్కెర ఎగుమతిపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధం కూడా విధించింది. మొత్తానికి అక్క‌డ‌ చక్కెర ధర 31 శాతం వరకు పెరిగింది.

ఇక‌, ర‌ష్యాపైన వివిధ దేశాల‌ ఆంక్ష‌ల కారణంగా అక్క‌డ అనేక ఇతర ఉత్పత్తులు కూడా ఖరీదైనవిగా మారుతున్నాయి. అలాగే, ప‌లు విదేశీ వ్యాపార‌ కంపెనీలు రష్యాతో వ్యాపారాలు మూసేశారు. త‌ద్వారా కార్లు, గృహోపకరణాలు, అలాగే టెలివిజన్ల వంటి విదేశీ దిగుమతి వస్తువులకు భారీ కొరత ఏర్ప‌డింది. దీనితో, కరెన్సీ నియంత్రణలను ప్రవేశపెట్టడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నించింది. దీని ఫలితంగా ర‌ష్యాలో చాలా మంది ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక‌, దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతుడ‌టం వ‌ల్ల ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌డంలేదు.

Advertisement

Next Story

Most Viewed