కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి (వీడియో)

by Mahesh |   ( Updated:2023-05-20 05:47:58.0  )
కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్ మారిపోయింది. దీన్నే తాజాగా జరిగిన ఆత్మాహుతి దాడి రుజువు చేసింది. శుక్రవారం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జమాత్ ఇ ఇస్లామీ పాకిస్థాన్ చీఫ్ సిరాజ్ ఉల్ హక్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఝోబ్‌లో బహిరంగ సభకు వెళుతున్నప్పుడు హక్ కాన్వాయ్‌ను బాంబర్ లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో.. సిరాజ్ ఉల్ హక్ కాన్వాయ్ లోని తన కారు వద్దకు చేరుకున్న బాంబర్.. తనను తాను పేల్చుకున్నాడు. ఈ దృష్యాలు కెమెరాలో క్లియర్ గా రికార్డ్ కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ ప్రమాదంలో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి అక్కడే చనిపోగా మరికొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story