- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి పాలకు బదులు సూర్యరశ్మి.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం, లైకుల కోసం కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు పిచ్చి చేష్టాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డైట్ కంట్రోల్ పేరుతో ఈ మధ్య కొందరూ సోషల్ మీడియా వేదికగా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు టిప్స్ చెబుతూ.. కొత్త ప్రయోగాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రష్యాకు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్ తన కొడుకుపై ప్రయోగం చేసి మరణానికి కారకుడయ్యాడు.
మనిషి బతకడానికి సూర్యరశ్మి చాలు
రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అతను సోషల్ మీడియా వేదికగా డైట్ కంట్రోల్ గురించి తన ఫాలోవర్స్‌కు చెబుతుంటాడు. ఆరోగ్యం, ఆహారం గురించి తన యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయోగాలతో డైట్ సూచనలు ఇస్తుంటాడు. మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితోనే ఎంతకాలమైన జీవించవొచ్చేనేది అతను చెబుతుంటాడు. ఈ క్రమంలోనే దాన్ని నిరూపించడం కోసం నెలలు కూడా నిండని తన కొడుకుపై ఈ ప్రయోగం చేశాడు. తన భార్య ఎంత చెప్పినా కూడా మాక్సిమ్ మాట వినకుండా పాలు సైతం పట్టొద్దని మూర్ఖంగా ప్రవర్తించేవాడు. దీంతో క్రమ క్రమంగా పిల్లాడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే పలువురు ఒత్తిడి చేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటడంతో చికిత్స పొందుతూ శిశువు ప్రాణాలు కోల్పోయాడు.
అతని భార్యకు రెండేళ్ల జైలు శిక్ష
దీంతో పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది. కోర్టులో విచారణ జరిగింది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని అందుకే బిడ్డ అనారోగ్యంతో మరణించాడని విచారణలో మాక్సిమ్ ఆరోపించేవాడు. మాక్సిమ్ తీసుకున్న చర్యలవల్లే బిడ్డ చనిపోయాడని నేరం రుజువు కావడంతో తాజాగా కోర్టు అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అతని భార్య ఉన్న విషయం చెప్పడంతో ఆమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.