- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇల్లు కొంటే.. భార్య ఫ్రీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన రియల్ ఎస్టేట్ సంస్థ!!
దిశ, సినిమా: సొంతంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్. దాన్ని నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. తక్కువ ధరలు ఉన్నప్పుడు ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రేట్లు తగ్గించడం, కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను గిఫ్ట్స్‌గా ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. తాజాగా వీటన్నింటికి విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓ వింత ఆఫర్‌ను ప్రకటించింది. పడిపోతున్న రియల్ ఎస్టేట్‌ను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో విచిత్రమైన ఆఫర్లకు తెరతీస్తున్నాయి.
ఈ సరికొత్త ఆఫర్ వింటే ఆశ్చర్యపోక తప్పదు. తాజాగా చైనాకు చెందిన ఓ కంపెనీ ‘ఇల్లు కొనండి, ఫ్రీగా భార్యను సొంతం చేసుకోండి’ అని ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నెట్టింట పలువురు జనాలు నిజంగానే భార్యను ఫ్రీగా ఇస్తున్నారా? ఆ కంపెనీ ఎక్కడుంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంత మంది ఈ ప్రకటనపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రపంచంలోనే చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచింది. అలాంటిది ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. గత సంవత్సరం చైనా ఎకానమీ 5.3 శాతం వృద్ధి నమోదు చేసినా విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా దీని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై ఉంది. ఇల్లు, భూముల కొనేవారు తగ్గడంతో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. అలాగే చైనాలో యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. ఆదాయం తగ్గిపోవడం, పెరుగుతున్న ఖర్చులు, కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. కాగా యువత వివాహంపై ఆసక్తి చూపడం లేదు.
ఈ కారణాన్ని బేస్ చేసుకుని చైనాలోని టియాంజన్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘ఇల్లు కొనండి.. భార్యను ఫ్రీ గా పొందండి’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించింది. ఇళ్లు కొన్న యువకులకు సంబంధాల ద్వారా పెళ్లిళ్లు కుదర్చవచ్చని భావించి ఉండొచ్చు. కానీ వీరి ప్లాన్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్రకటన ఇచ్చిన కంపెనీపై చైనీస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా ప్రకటన ఇచ్చినందుకు సదరు కంపెనీకి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ సంస్థ 4,184 డాలర్ల పెనాల్టీ విధించింది.