రక్తదానంలో నయా రికార్డ్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Shiva |
రక్తదానంలో నయా రికార్డ్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తన జీవిత కాలంలో ఒకసారి లేదా పరస్థితుల బట్టి రెండు, మూడు సార్లు రక్తదానం చేసుంటారు. మరికొందరు అసలే చేయరు. పలుమార్లు రక్తదానం చేస్తే తమకు ఎలాంటి అనారోగ్యం బారిన పడతామేమోనని అపోహలకు గురవుతుంటార. కానీ, ఏకంగా 203 సార్లు రక్తదానం చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఓ మహిళ ఈ అరుదైన రికార్డును సాధించింది. అమెరికాకు చెందిన జోసెఫిన్ మికలక్ మహిళ, వయసు 80 ఏళ్లు. ఇప్పటి వరకు ఈమె 203 సార్లు రక్తదానం చేశారంటా. అలా ఆమె అత్యథికంగా రక్తదానం చేసిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు.

1965లో, 22 ఏళ్ల వయసులో తొలిసారి రక్తదానం చేశారు మికలక్. అప్పట్టి నుంచి తాను క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఏడాదికి కనీసం నాలుగు సార్లు ఆమె రక్తదానం చేస్తారు. మధ్యలో గర్భం దాల్చినప్పుడు, వైద్యుల సూచన మేరకు ఆమె రక్తదానం చేయలేదు. అలా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది జోసెఫిన్. 80 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆమె రక్తదానం చేస్తుండటం ఆమె గొప్పతనం. అయితే, కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తరువాతే రక్తదానం చేయడానికి ఆమెను వైద్యులు అనుమతిస్తున్నారు.

ఇది వరకు ఈ రికార్డు ఓ భారతీయురాలి పేరిట ఉండేది. భారత్ కు చెందిన మధుర అనే మహిళ, 117 సార్లు రక్తదానం చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ రికార్డును అమెరికాకు చెందిన జోసెఫిన్ అధిగమించారు. జోసెఫిన్ బ్లడ్ గ్రూప్ వో-పాజిటివ్. అమెరికాలో 37శాతం మంది ఈ గ్రూప్ కలిగి ఉన్నారు. దీంతో చాలామందికి సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని జోసెఫిన్ గర్వంగా చెబుతారు. తన తుదిశ్వాస వరకు రక్తదానం చేస్తూనే ఉంటానని ఆమె తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed