- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2025కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ఆ రెండు దేశాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు(New Year 2025) అంబరాన్నంటాయి. పలుదేశాల్లో ఇప్పటికే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్(Auckland), న్యూజిలాండ్(New Zealand) ప్రజలు 2025కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేశారు. బాణాసంచా పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు. ఆక్లాండ్‌లో బాణాసంచా షోను చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివచ్చారు. నూతన సంవత్సరాన్ని మొదటగా కిరిబాటి, సమోవా, టోంగా దేశాలు జరుపుకున్నాయి. అంటే భారత కాలమానం ప్రకారం ఈ దేశాల్లో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3:30 గంటలకే మొదలయింది.
చివరగా న్యూ ఇయర్ జరుపుకునే ప్రాంతాల్లో అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు ఉన్నాయి. అమెరికన్ సమోవాలో చివరగా అంటే బుధవారం ఉదయం 6:00కు నూతన సంవత్సరం వేడుకను జరుపుకుంటారు. ఈ పరిధిలోని ప్రాంతాల ప్రజలు సమోవాకు చేరుకుని చివరగా న్యూ ఇయర్ వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవడం విశేషం. నూతన సంవత్సరం అంటే అందరికీ ఒక కొత్తదనం, కొత్త ఆశలు, కొత్త అనుభవాలను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా జరుపుకుంటారు.