అమెరికాలో 'న‌యా ఐన్‌స్టీన్'! అలాంటి జుట్టు ఎంతో అరుదు!!

by Sumithra |
అమెరికాలో న‌యా ఐన్‌స్టీన్! అలాంటి జుట్టు ఎంతో అరుదు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః వివిధ కార‌ణాల వ‌ల్ల మ‌నిషిలో ర‌క‌ర‌కాల జన్యుమార్పిడులు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. అది ఐన్‌స్టీన్ లాంటి గొప్పోళ్ల‌ని పుట్టించొచ్చు, 'స‌జీవశ‌వం' లాంటి మ‌నిషికీ కార‌ణం కావ‌చ్చు. ఏదేమైనా స‌హ‌జంగా వ‌చ్చే కొన్ని అసాధార‌ణ మార్పుల‌కు కార‌ణం ఏదైనా సాధార‌ణ స‌మాజానికి అది ప్ర‌త్యేకమే. ఐన్‌స్టీన్ జుట్టు అలా నిటారుగా లేచి, పీలిక‌లుగా ఉండ‌టానికి కార‌ణం స‌రిగ్గా ఇలాంటి జ‌న్యు సంబంధిత కార‌ణ‌మే. అయితే, యునైటెడ్ స్టేట్స్‌లోని లాక్లాన్ శాంపిల్స్ అనే బాలుడికి ఐన్‌స్టీన్ లాంటి వెంట్రుక‌లే వ‌చ్చాయి. ఆ బాబు ''అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్'' (UHS)తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్థారించారు. ఈ వ్యాధి ప్ర‌పంచవ్యాప్తంగా మ‌హా అయితే ఓ 100 కేసులుంటాయంతే. అంత‌, అరుదైన వ్యాధి.

ఈ వెంట్రుక‌ల్లో ఇన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే ఇవి వాట‌ర్ రెసిస్టెంట్ లాక్స్‌ను క‌లిగి ఉండ‌టం. కాబ‌ట్టి, 14-నెలల ఈ బాలుడికి స‌ద‌రు సిండ్రోమ్ వ‌ల్ల జుట్టు ఇలా వ‌చ్చింద‌ని త‌ల్లిదండ్రులకు ఎలాంటి చింతా లేదు. పైగా, అంద‌రి జుట్టులా మాసిపోవ‌డం త‌క్కువ‌, వారానికి ఒకసారి మాత్రమే జుట్టుపైన జ‌స్ట్ నీళ్లు పోస్తే క్లీన్ అయిపోతుంది అంటారు లాక్లాన్ త‌ల్లి కేట్లిన్ శాంపిల్స్. ఇది జుట్టు సంరక్షణను చాలా సులభం చేస్తుందని ఆమే సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. లాక్లాన్ దాదాపు ఐదు నెలల వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి జుట్టు రావ‌డం ప్రారంభ‌మ‌య్యిందంట‌.

లాక్లాన్‌కు జుట్టు ఇలా ఉండ‌టం త‌ప్ప ఇంకెలాంటి అనారోగ్య‌మూ లేక‌పోవ‌డంతో తండ్రి కాలేబ్‌, త‌ల్లి కేట్లిన్‌లు సంతోషంగానే ఉన్నారు. బాబును చూస్తున్న డాక్ట‌ర్ ప్ర‌పంచంలో ఇలాంటి వ్యాధి ఉన్న‌వారిని సంప్ర‌దించి, ఎలాంటి వైద్యం చేయ‌ల‌నే దానిపై ప‌రిశోధ‌న చేస్తున్నారు. ఇక‌, ఇలాంటి జుట్టుతో లాక్లాన్ ఆ చుట్టు ప‌క్క‌ల సెల‌బ్రిటీ అయ్యాడు. కొంద‌రు, జుట్టు కోడీ అని వెక్కిరిస్తే, ఇంకొంద‌రు న‌యా ఐన్‌స్టీన్ అంటూ పొగిడేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed