డ్రోన్ ఎటాక్.. ముగ్గురు సైనికుల మృతి.. 34 మందికి గాయాలు

by Hajipasha |   ( Updated:2024-01-28 18:29:19.0  )
డ్రోన్ ఎటాక్.. ముగ్గురు సైనికుల మృతి.. 34 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : గాజా - ఇజ్రాయెల్ యుద్ధం క్రమంగా విస్తరిస్తోంది. గాజాకు చెందిన హమాస్ సంస్థకు మద్దతు తెలిపే మిలిటెంట్ గ్రూపులు మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున సిరియాలోని అల్ తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోగా, మరో 34 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఈవివరాలను స్వయంగా అమెరికన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది. సూసైడ్ డ్రోన్ ఎటాక్ జరిగిన టైంలో అమెరికా సైనికులు టెంట్లలో నిద్రిస్తున్నారని తెలిసింది. సిరియా, ఇరాక్ దేశాలు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్ గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. దీనిపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఈ దాడి జోర్డాన్ బార్డర్‌లో జరిగిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన జోర్డాన్ సర్కారు తమ దేశ భూభాగంలో దాడులేం జరగలేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed