- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. 17 మంది సిబ్బందీ భారతీయులే
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా యూఏఈ తీరంలో ఇజ్రాయెల్‌కు చెందిన కంటైనర్ షిప్ ‘ఎంఎస్‌సీ ఏరీస్’ను ఇరాన్ నేవీ సీజ్ చేసింది. హెలికాప్టర్ ద్వారా ఆ షిప్‌ను చుట్టుముట్టిన ఇరాన్ నేవీ.. తొలుత హెచ్చరికగా కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకను ఇరాన్ తీరం వైపుగా తీసుకెళ్లింది. ఈ షిప్‌లో మొత్తం 25 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌కు ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ నౌకను ఇటాలియన్-స్విస్ షిప్పింగ్ కంపెనీ ‘ఎంఎస్‌సీ’కి లీజుకు ఇచ్చారని తెలుస్తోంది. ఈవివరాలను ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది. ఈనేపథ్యంలో 17 మంది భారతీయుల భద్రత కోసం భారత విదేశాంగ శాఖ రంగంలోకి దింపింది. ఇరాన్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది.