సింగరేణి అభివృద్ధిలో కార్మికులదే కీలక పాత్ర: శ్రీనివాసరావు

by Sridhar Babu |
Singareni-Karmikulu1
X

దిశ, భూపాలపల్లి: సింగరేణి అభివృద్ధిలో కార్మికుల కీలక పాత్ర అని భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. సింగరేణి 133వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదట సింగరేణి జెండాను ఎగురవేసి సింగరేణి గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల రక్షణ సింగరేణి సంస్థ కర్తవ్యమని కార్మికులు రక్షణతో కూడిన విధులను నిర్వహించాలని ఆయన కోరారు. సింగరేణి సంస్థ దేశానికి మూల స్తంభం లాంటిదని.. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం సింగరేణి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తదన్నారు. అనంతరం ఆయన సింగరేణిలో సేవా సమితి ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. సింగరేణి బొగ్గులో ప్రమాదం జరిగినప్పుడు ఎలా రక్షణ చర్యలు తీసుకోవాలనేదానిని సింగరేణి రెస్క్యూ టీం ప్రదర్శించారు.

Advertisement

Next Story

Most Viewed