- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనస్థాపంతో కార్మికుడు బలవన్మరణం
దిశ, పటాన్‌చెరు: భార్య పిల్లలపై పెట్టుకున్న బెంగతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ కార్మికుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… బీహార్‌లోని భోజ్‌పురి జిల్లా కేశవన్ గ్రామానికి చెందిన మన్నన్ కుమార్ సింగ్ (32) బతుకుదెరువు కోసం, ఐదు నెలల క్రితం తెలంగాణకు వచ్చాడు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని అరబిందో యూనిట్-5లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత కొద్దిరోజుల నుంచి భార్య పిల్లల పైన బెంగ పెట్టుకున్న మన్నన్ కుమార్ ఆదివారం ఉదయం ఫస్ట్ షిఫ్ట్ వెళ్లి వచ్చిన అనంతరం రూమ్‌లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి ముత్తంగిలోని డీఎం కాలనీలో నివాసముంటున్న మృతుడి సోదరుడు చందన్ కుమార్‌కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న చందన్ కుమార్ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చందన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.