మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం..

by Shyam |
మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం..
X

దిశ, హైదరాబాద్‌
మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని చార్మినార్‌ వద్ద షీ టీమ్స్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ ఆధ్వర్యంలో 5కె, 2కె పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ హాజరై ప్రసంగించాడు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. వారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశం చార్మినార్‌ అన్నారు. మహిళలకు షీ బృందాలు పూర్తి భద్రత కల్పిస్తున్నాయన్నారు. షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతిలక్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి షీ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు షీ టీమ్స్‌ నిరంతరం పని చేస్తున్నాయని తెలిపారు.

tags;she teams, hyderabad, womens day, dgp mahender reddy

Advertisement

Next Story

Most Viewed