- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో కలకలం.. న్యాయం చేయాలంటూ స్టార్ హీరో ఇంటిముందు మహిళ ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటిముందు ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అజిత్ ను కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకు కారణం అజిత్ అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సదురు మహిళ ఒంటిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే.. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఫర్జానా అనే మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. గతేడాది కరోనా సమయంలో అజిత్, అతని భార్య షాలిని ఆ హాస్పిటల్ కి వెళ్లగా ఫర్జానా వారితో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అజిత్ కి కరోనా కారణంగా షాలిని అక్కడికి వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక సదురు హాస్పిటల్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించిన నర్సు ఫర్జానా పై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆవేదన చెందిన ఆమె అజిత్ ని కలిసి తన ఉద్యోగం తనకు వచ్చేలా చేయాలనీ కోరడానికి ఆయన ఇంటికి పలుమార్లు వెళ్లగా.. ఆమెను సెక్యూరిటీ లోనికి పంపించలేదు. ఈ నేపథ్యంలోనే అజిత్ ఇంటిముందు ఆమె తనకు న్యాయం చేయాలనీ కోరుతూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను అదుపులోనికి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ప్రస్తుతం ఈ ఘటన కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.