పురుషులకు దీటుగా మహిళా అధికారులూ ఈదుతారు : సుప్రీం

by Shamantha N |   ( Updated:2020-03-17 01:40:53.0  )
పురుషులకు దీటుగా మహిళా అధికారులూ ఈదుతారు : సుప్రీం
X

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నౌకా దళంలో పురుష అధికారులతో సమానంగా మహిళల అధికారులకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పురుషులకు దీటుగా మహిళా అధికారులూ ఈత కొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వివరించింది. అందుకే మూడు నెలలోపు మహిళా అధికారులకూ పర్మినెంట్ కమిషన్‌ను వర్తింపజేయాలని ఆదేశించింది.

దేశానికి సేవ చేస్తున్న మహిళలకు శాశ్వత కమిషన్‌ను తిరస్కరించడమంటే.. న్యాయాన్ని తప్పుదోవ పట్టించినట్టవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళా అధికారులకు నేవీలో ప్రవేశానికి అవకాశం కల్పించే నిర్ణయం తీసుకున్నాక.. పురుషులతో సమానంగా వారికీ ప్రాధాన్యతను ఇవ్వాల్సిందేనని తెలిపింది. లింగ వివక్ష తగదని హితవు పలికింది.

Tags: navy, permanent commission, supreme court, women officers, discrimination, gender

Advertisement

Next Story