- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూలికి వెళ్లిన మహిళ.. సజీవ దహనం..?
దిశ, పటాన్‌చెరు : ఇంటి నుంచి కూలి పనికని వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైన ఘటన పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగ్ధర్ గ్రామానికి చెందిన తోర్నాల నారాయణ, అతని భార్య లక్ష్మీ అలియాస్ సావిత్రి (40) కొన్నాళ్ల కిందట బతుకుదెరువు కోసం కుటుంబంతో వచ్చి మండలంలోని ఇస్నాపూర్ వడ్డెర కాలనీలో నివాసముంటున్నారు. అడ్డమీద కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కూలి పని కోసం లంచ్ బాక్స్‌తో ఇస్నాపూర్‌లోని లేబర్ అడ్డా వద్దకు వెళ్తానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది.
రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిట్కుల్ గ్రామ శివారులోని నక్క వాగు పక్కన గల సర్కారు తుమ్మ చెట్ల పొదల్లో గుర్తుతెలియని మహిళా శవాన్ని గుర్తించారు. పటాన్ చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, క్రైమ్ సీఐ ఎస్. శ్రీనివాసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులు, క్లూస్ టీం డాగ్ స్క్వాడ్‌లను రప్పించి పరిశీలించగా శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఆ మహిళ ఓ వ్యక్తితో కలిసి పొదల్లోకి వెళ్ళినట్లు గుర్తించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌లను పరిశీలించడంతో పాటు అత్యాచారం, హత్యా కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైమ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.