సీనియర్ లెవెల్ స్థాయిలో భారీగా పెరిగిన మహిళల నియామకాలు

by Harish |
సీనియర్ లెవెల్ స్థాయిలో భారీగా పెరిగిన మహిళల నియామకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్య స్థాయి మేనేజ్‌మెంట్ నుంచి సీనియర్ లెవెల్ విభాగాల్లో మహిళల నియామకాలు భారీ పెరిగాయి. 2019లో 18 శాతంగా ఉన్న ఈ నియామకాలు 2020లో ఏకంగా 43 శాతానికి పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ జాబ్ ప్లాట్‌ఫామ్ జాబ్‌ఫర్‌హర్ ‘డైవర్శిటీ బెంచ్‌మార్కింగ్ రెపోర్ట్ 2020-21’ నివేదిక దేశంలోని అనేక రంగాలు, పరిశ్రమల్లోని వివిధ స్థాయిలలో మహిళల పురోగతిపై 300కు పైగా కంపెనీల నుంచి వివరాలను సేకరించింది. గతేడాది మహిళల నియామకంలో ప్రాధాన్యం మెరుగ్గా కొనసాగిందని 41 శాతం స్టార్టప్‌లు అభిప్రాయపడ్డాయి. అనేక సంస్థలు కీలక బాధ్యతల విషయంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు చొరవ తీసుకుంటున్నాయని నివేదిక తేల్చింది.

కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, రీమోట్ వర్క్ పెరగడంతో 40 శాతం కంపెనీలు ఈ రకమైన నియామకాలను పెంచాయి. దీంతో నియామకాల్లోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు మహిళలకు ప్రసూతి సెలవుల విషయంలో బడా సంస్థలు, స్టార్టప్‌లు, ఎస్ఎంఈలతో సహా అన్ని సంస్థల్లో 45 శాతం కంపెనీలు మాత్రమే ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్టు నివేదికలో తేలింది. ‘ దేశంలోని అనేక సంస్థలు ఉద్యోగ నియామకాల్లో మహిళల ప్రాముఖ్యతను గుర్తించాయి. ఇప్పుడిప్పుడే దాన్ని అమలు చేస్తున్నాయి. కార్యాలయాల్లో మహిళల సంఖ్యను మరింత పెంచే దిశగా నిర్ణయాలు, నియామకాలు చేపట్టడం సంతోషంగా ఉందని’ జాబ్‌ఫర్‌హర్ వ్యవస్థపకులు, సీఈఓ నేహా బగరియా చెప్పారు.

Advertisement

Next Story