రైల్వే ‌ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

by Sridhar Babu |
రైల్వే ‌ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
X

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు సమీపంలోని రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో ఓ యువ‌తి మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న బుధ‌వారం ఉద‌యం వెలుగులోకి రాగా, మృతురాలు గంగా బిషన్ బస్తీకి చెందిన గోవా రాధికగా పోలీసులు గుర్తించారు. అయితే, యువతి మృతికి గల కారణం తెలుసుకునేందుకు ఆమె ఫోన్ రికార్డుల‌ను పోలీసులు ప‌రిశీలించ‌నున్నారు. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల‌ను సైతం విచారిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకుందా..మ‌రేదైనా కార‌ణంతో హ‌త్యకు గురైందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని కొత్త‌గూడెంలోని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించిన‌ట్లు రెండో పట్టణ పోలీస్ స్టేష‌న్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story