- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేప్ అటెంప్ట్.. ఊహించని షాకిచ్చిన మహిళ.. ఇరువురిపై కేసు!

దిశ, వెబ్‌డెస్క్ : తనపై అత్యాచారానికి యత్నించిన ఓ ప్రబుద్ధుడికి ఎవరూ ఊహించని విధంగా బుద్ధి చెప్పింది బాధిత మహిళ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని వ్యక్తి 45 ఏళ్ల మహిళపై అత్యాచారానికి యత్నించాడు. అతన్ని కంట్రోల్ చేసేందుకు ఆ మహిళ ఎంతగానో ప్రయత్నించినా సాధ్యపడలేదు.
దీంతో సహనం కోల్పోయిన బాధితురాలు పక్కనే ఉన్న పదునైన ఆయుధంతో అతని మర్మాంగాలను కోసేసింది. ఈ విషయం స్థానికంగా సంచలనం రేపగా.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని తొలుత ఆస్పత్రికి తరలించిన పోలీసులు అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా, తనపై దాడి చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని నిందితుడు కూడా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.