- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భర్త నుండి నా ప్రియుడ్ని కాపాడండంటూ కోర్టుకెక్కిన మహిళ..
దిశ, వెబ్‌డెస్క్: తన భర్త నుండి తన ప్రియుడిని కాపాడాలని ఏకంగా కోర్టుకెక్కింది ఓ మహిళ. వారి అభ్యర్ధనను అంగీకరించిన కోర్టు వారికి పోలీస్ రక్షణ కల్పించాలంటూ తీర్పునిచ్చింది. ఈ కేసుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసుకి సంబంధించిన పూిొర్తి వివరాలలోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రాల్లోనే ఫరీద్‌కోట్ ప్రాంతంలో ఓ వ్యక్తి (40) తన భార్య(38) తో కలిసి నివాసముంటున్నాడు. పెళ్లైన దగ్గరనుండి కలతలు లేని ఆ కాపురంలో ఓ కుర్రాడు చిచ్చు పెట్టాడు. పెళ్లైన కొత్తలో రోజూ మెచ్చుకునే భర్త.. ఇప్పుడు మెచ్చుకోకపోయే సరికి ఆ భార్యకు వేరే ఆలోచనలు మొదలయ్యాయి. రోజు తనను, తన అందాన్ని పొగుడుతూ ఉండే కుర్రాడి పై మనసుపడింది. దాంతో వారిద్దరి చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కొన్ని రోజులు భర్తకు తెలియకుండా సాగిన వీరి ప్రేమాయణం ఒకరోజు భర్తకు తెలిసిపోయింది. భర్త నిలదీయడంతో ఆమె ప్రియుడంటే తనకు ఇష్టమని చెప్పడంతో భర్త కోపోద్రేకుడయ్యాడు. భార్య ప్రియుడ్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో భార్య, ప్రియుడితో కలిసి కోర్టుకెక్కింది. తన భర్త నుండి ప్రియుడికి ముప్పు ఉందని, తమకు పోలీసుల రక్షణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ పై కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. 2018 లో వివాహేతర సంబంధం తప్పు కాదు అనే చట్టాన్ని పరిగణలోకి తీసుకొంటూ వారిద్దరికీ పోలీసులు రక్షణ కల్పించవల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఐతే… ఇలా చెప్పినంత మాత్రాన… తాము వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు అని కూడా హైకోర్టు చెప్పింది.కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరికీ పూర్తీ రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంచలన తీర్పుపై ప్రజలు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. భార్య తప్పు చేసిందన్న కోసం లో భర్త చంపేస్తాను అంటే .. దానికోసం కోర్టుకెక్కాలా..? అని కొందరు. భారత దేశం కూడా పాశ్చ్యాత దేశాలుగా మారుతున్నది అని తెలపడానికి ఈ కేసు ఉదాహరణ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.