- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భోజనం చేస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలి!
దిశ, నల్లగొండ: ఆమె ఓ కంపెనీలో పనిచేస్తోంది. రోజులాగానే పని చేసి మధ్యాహ్నం తోటి కార్మికులతో కలిసి భోజనం చేసిన చోటనే ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన బోగ ఉమ కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఆసుప్రతికి తరలించేలోపే చనిపోయింది. కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబానికి యాజమాన్యం రూ.10 లక్షల నష్టంపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.