- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హే నువ్వేనా.. మేకప్ లేని భార్యను చూసి గుండెలు బాదుకున్న భర్త
దిశ,వెబ్‌డెస్క్: హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో మేకప్ చిచ్చుపెట్టింది. 22ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా భర్త,భార్యను చూసి కంగుతిన్నాడు.పో నీ మొహం నాకు చూపించకంటూ చీదరించుకుంటున్నాడు. పాపం ఏం చేయాలో పాలుపోని ఆ మహా ఇల్లాలు భర్త చెంతకు చేరేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.
నేషనల్ మీడియా కథనం ప్రకారం.., ఆ ఇద్దరు భార్య- భర్తలు. 22ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికి ఇద్దరు పిల్లలు. 22ఏళ్లుగా ఆ కుటుంబంలో ఎలాంటి కలహాలు, కలతలు లేకుండా హాయిగా సాగింది. కానీ ఓ రోజు భార్య చేసిన పనికి ఆ కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నమైంది. భర్త.., భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతుంది.
పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఆఫీసులో మీటింగ్స్ ఇలా దేనికైనా అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవడం తప్పనిసరి. కానీ ఓ మహిళ తన భర్తకు అందంగా కనిపించాలని 22ఏళ్లుగా భర్తకు తెలియకుండా మేకప్ వేసుకుంటుంది. ఆ మేకప్ కోసం రోజూ గంట సమయాన్ని కేటాయిస్తుంది. ఆ మేకప్ లో ఉన్న భార్య అందాన్ని చూసి భర్త మంత్ర ముగ్ధుడయ్యేవాడు. రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పడు భార్య అందం గురించి “అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. అందరికీ అందనిదీ ఈ పూచిన కొమ్మ” అని పాడేవాడు. అయితే ఓ ఆదివారం రోజు మేకప్ లేకుండానే భర్త ఎదురుగా నిలబడింది. అంతే మేకప్ లేకుండా భార్య మొహాన్ని చూసిన భర్త కంగుతిన్నాడు. హే నువ్వేనా.. మేకప్ లేని భార్యను చూసి గుండెలు బాదుకున్నాడు. మేకప్ వేసుకొని నన్ను మోసం చేస్తావా..? నీ మొహం నాకు చూపించకు. నా ఎదురు నిలబడొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ తో ఆందోళనకు గురైన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖ రాసింది.
ఆ లేఖలో ఇలా..,నేను 22 ఏళ్లుగా నాభర్తకు తెలియకుండా మేకప్ వేసుకుంటున్నా. మేకప్ కోసం గంటసమయాన్ని కేటాయిస్తున్నా. థ్రెండ్డింగ్, క్లీనింగ్ అంటూ నా ఒళ్లు హూనం చేసుకున్నా. ఆదివారం షాపింగ్, ఇంటిపని, వంట పనిచేయడంతో ఓపిక లేక మేకప్ వేసుకోలేకపోయా. నా భర్త నన్ను మేకప్ లేకుండా చూసి ఆశ్చర్యపోయాడు. గుర్తుపట్టలేకపోయాడు. ఈ మేకప్ వల్ల మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ చెప్పుకొచ్చింది బాధితురాలు.