తల్లిని చంపాక ఏడ్వలేదు, నిద్రపోలేదు

by Sumithra |
తల్లిని చంపాక ఏడ్వలేదు, నిద్రపోలేదు
X

తన తల్లిని చంపి, సోదరుడిని కత్తితో పొడిచి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అండమాన్ పారిపోయిన అమృత చంద్రశేఖర్ కొంచెం కూడా ఏడవలేదని, నిద్రపోలేదని పోలీసులు చెప్పారు.

అమృతను పోర్టు బ్లెయిర్‌లో పట్టుకుని ఫిబ్రవరి 5న బెంగళూరు తీసుకువచ్చాక స్థానిక పోలీసు స్టేషన్ ఆమె తన తలను గోడకేసి కొట్టుకుందని, ఆమెను విడిపించడం కష్టమైందని కేసును పరిశీలిస్తున్న సీనియర్ పోలీసు ఒకరు చెప్పారు. తర్వాత ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించాక కొద్దిసేపు నిద్రపోయి ఆరోజు జరిగిన ఘటన గురించి నోరు విప్పిందన్నారు.

బ్యాంకుల వాళ్లు తనను ఇబ్బంది పెట్టకూడదని ముందు ఆత్మహత్యకు ప్రయత్నిద్దామనుకున్న అమృత, ఆమె చనిపోతే తన తల్లిని, సోదరుడిని వేధిస్తారని భావించింది. దీంతో వాళ్లను కూడా చంపుదామనుకున్నట్లు తెలుస్తోంది. కానీ వాళ్లను చంపాక బాయ్‌ఫ్రెండ్‌తో అండమాన్‌కి పారిపోవాల్సిన అవసరం ఏంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed