- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ పెట్టుకోమన్నందుకు పొట్టు పొట్టు కొట్టిన మహిళ
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా ప్రజలు మాత్రం నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. తాజాగా ముంబైలోని కండివాలి ప్రాంతంలో మాస్క్ లేకుండా ఆటో ఎక్కుతున్న ఓ మహిళను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ ) కార్మికురాలు ప్రశ్నించింది. మాస్క్ లేకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదంటూ అడ్డు తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ నువ్వెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతానని బాధితురాలిపై దాడి చేసింది. జుట్టుపట్టుకొని లాగింది. చెంపపై కొట్టింది. మొహం మీద గుద్దింది. అయితే ఈ దాడి జరిగే సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ముంబైలో ప్రతిరోజు 3వేలకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాస్క్ లేకుండా పబ్లిక్ లో ఎవరు కనిపించినా చలాన్లు విధించాలని ఆదేశించింది. దీంతో బీఎంసీ ఉద్యోగులు మాస్క్ లేకుండా తిరుగుతున్నవారిపై కన్నెర్రజేస్తున్నారు.