- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే కక్ష సాధింపు.. మహిళా సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆయన ఓ ఎమ్మెల్యే.. నిత్యం ప్రజాసమస్యల కోసం పాటుపడాలి. కానీ సొంత నియోజకవర్గంలోని ఓ మహిళా సర్పంచ్‌పై కక్షసాధింపు చర్యలు దిగుతున్నాడు. అందుకు కారణం టీఆర్ఎస్‌లో వర్గపోరే. మాజీ ఎమ్మెల్యే అనుచరులనే కోపంతో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో సదరు మహిళా సర్పంచ్ హరితహారం పనుల్లో నిర్లక్ష్యం వహించిందంటూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తాజాగా ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతకీ ఇది జరిగింది ఎక్కడో కాదు.. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోనే. ఆ ప్రజాప్రతినిధి మరెవరో కాదు.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బాధిత మహిళ అదే నియోజకవర్గంలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ. అసలు మహిళా సర్పంచ్ మల్లమ్మ ఎందుకు సస్పెండ్ అయ్యింది..? ఆమెకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మధ్య పంచాయతీ ఏంటి..? నిజంగానే ఎమ్మెల్యే కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారా..? తదితర అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
అసలు జరిగింది ఇదీ..
చిట్యాల మండలం వెలిమినేడు మహిళ సర్పంచ్ మల్లమ్మ వెలిమినేడు గ్రామపంచాయతీ పరిధిలోని మరితహారం మొక్కలపై అశ్రద్ధ చూపుతున్నారనే కారణంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ సోమవారం సస్పెండ్ చేశారు. దీన్ని ఖండిస్తూ సదరు మహిళా సర్పంచ్ మల్లమ్మ.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కావాలనే తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయించారని ఆరోపించింది. ఆ మేరకు మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. గతంలో ఎమ్మెల్యే లింగయ్య తన పట్ల వివక్షతను చూపుతూనే వస్తున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు పెట్టే విషయంలోనూ, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం అనే నన్ను ఏ పనీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెలిమినేడు గ్రామ ఉపసర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని, అందుకు 13 మంది వార్డు సభ్యులు మద్దతిచ్చారని, సంబంధిత పత్రాలను ఆర్డీఓ చేతుల్లోంచి గుంజుకుని ఎమ్మెల్యే లింగయ్య చింపేశారని మల్లమ్మ చెబుతోంది. అభివృద్ది పనులు చేసి చెక్కుల మీద సంతకాలు పెట్టకుండా ఉపసర్పంచ్ ఎమ్మెల్యే సపోర్టుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయింది.
కంపెనీల్లో వసుల్లా..
వెలిమినేడు గ్రామపంచాయతీ పరిధిలో పలు పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఆ కంపెనీల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి తనకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బెదిరిస్తున్నారని మహిళా సర్పంచ్ మల్లమ్మ ఆరోపిస్తోంది. తనకు ఏలాంటి వసూళ్లు చేయడం చేతకాదని చెప్పినా.. ఎమ్మెల్యే విన్పించుకోవడం లేదని, మహిళనైన తనపై ఇలాంటి కక్షసాధింపు ఎందుకని విన్నవించుకున్నారు. ఈ విషయంలో ఎంత బతిమాలినా.. ఎమ్మెల్యే లింగయ్య వినడం లేదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్.. జోక్యం చేసుకుని తన సమస్యను పరిష్కరించాలని కోరారు. కావాలంటే.. తన పనులపై విచారణ చేసుకున్నాకే.. నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
మరోసారి బయటపడ్డ వర్గపోరు..?
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు మరోసారి బట్టబయలయ్యింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. అందులో భాగంగానే తరచూ వీరేశం, లింగయ్య వర్గీయుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు నకిరేకల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన డబ్బుల పంపిణీలోనూ రెండు వర్గాల మధ్య వివాదం నడిచింది. నియోజకవర్గంలోని ఓ జడ్పీటీసీ భర్తకు, ఓ మాజీ సర్పంచ్‌కు మధ్య కొంత ఘర్షణపూరిత వాతవరణం నెలకొందనే ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి. వాస్తవానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాన్ని పక్కన పెడుతున్నారనేది ఓ వర్గం ఆరోపిస్తోంది.
తప్పు చేస్తే ప్రగతిభవన్ ముందు ముక్కు నేలకు రాస్తా..
నేను తప్పు చేస్తే ప్రగతి భవన్ ముందు ముక్కు నేలకు రాస్తా. నేను రూపాయి తినలే. నా మూడెకరాల భూమి, ప్లాటు, మెడ మీద బంగారం అమ్మి ప్రజల కోసం అభివృద్ది పనులు చేశా. ఉపసర్పంచ్‌ను అవిశ్వాస తీర్మానం నుంచి కాపాడేందుకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నన్ను సస్పెండ్ చేయించారు. నా శవాన్ని చిట్యాల మండల కేంద్రంలో వేయండి. కేసీఆర్, కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి నాకు న్యాయం చేయాలి. పదేండ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిజేసిన. వేరే పార్టీ నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడ్తుర్రు. – దేశబోయిన మల్లమ్మ, వెలిమినేడు సర్పంచ్