58 రోజులు.. బోటులో ఆస్ట్రేలియా రౌండప్!

దిశ, వెబ్‌డెస్క్ : గిన్నిస్ బుక్‌‌లో రికార్డ్ క్రియేట్ చేసేందుకు ఆస్ట్రేలియా అడ్వెంచరర్ సెయిలర్ ‘లిసా బ్లెయిర్’ 58 రోజుల పాటు ఆ దేశం మొత్తాన్ని బోటులో చుట్టేసింది. సిడ్నీ హార్బర్‌ నుంచి ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభించిన లిసా.. ఆస్ట్రేలియా మొత్తాన్ని క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో తిరిగి వచ్చి ఔరా అనిపించింది. మొత్తంగా ఆమె 58 రోజుల 2 గంటల, 25 నిమిషాల్లో ఈ ఫీట్‌ను పూర్తి చేసి, తొలి మహిళా సెయిలర్‌గానూ ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

ఈ ప్రయాణంలో లిసా.. 6536 నాటికల్ మైళ్లు (12,104 కిలోమీటర్లు’ ప్రయాణించింది. సగటున గంటకు 8.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తను నడిపింది ఎకో పవర్ బోట్ కావడం మరో విశేషం. లిసా తన ప్రయాణంలో ఎన్నో చాలెంజింగ్ వెదర్ కండిషన్స్‌ ఫేస్ చేయడం గమనార్హం. తుపానుతో పాటు, 5 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అలలను తట్టుకుంటూ తన జర్నీని కొనసాగించింది. చాలెంజింగ్ క్లైమేట్, బిజీ షిప్పింగ్ రూట్స్ కారణాలతో లిసా ప్రతిరోజు కేవలం 20 నిమిషాలు మాత్రమే నిద్రించింది. కాగా, లిసాకు ఒంటరిగా సెయిలింగ్ చేయడం, రికార్డులు సాధించడం కొత్త కాదు. ఆమె 2017లోనూ అంటార్కిటికా మొత్తాన్ని చుట్టేయడం విశేషం.

Advertisement